అరుదైన 'రుమాటిజం' వ్యాధితో బాధపడుతున్న యాంకర్ రష్మి!

  • శరీర బరువులో హెచ్చుతగ్గులకు కారణమయ్యే 'రుమాటిజం'
  • 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తెలిసింది
  • ఆహారం విషయంలో క్రమశిక్షణగా ఉంటున్నానన్న రష్మి
హాట్ యాంకర్ గా, సినీ నటిగా పేరు తెచ్చుకున్న రష్మికి ఓ అరుదైన వ్యాధి ఉందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్ వేదికగా తన అభిమానులకు చెప్పింది. శరీర బరువులో హెచ్చుతగ్గులకు కారణమయ్యే 'రుమాటిజం' అనే వ్యాధి తనకు ఉందని, ఈ విషయం తనకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తెలుసునని చెప్పింది.

ఇటీవల రష్మిని ఓ ఈవెంట్ లో తాను చూశానని, చీరలో ఆమె చాలా లావుగా కనిపించిందని, శరీరాకృతి విషయంలో జాగ్రత్త వహించాలని ఓ అభిమాని సూచించడంతో, రష్మి స్పందించింది. తనకున్న వ్యాధి కారణంగానే లావు విషయంలో హెచ్చుతగ్గులు వస్తుంటాయని, తాను చిన్నప్పటి నుంచీ ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణగానే ఉంటానని చెప్పింది.

ఈ వ్యాధి నుంచి బయట పడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న సమయంలో దుష్పరిణామాలు వచ్చాయని చెప్పుకొచ్చింది. ఇక రష్మి వ్యాధి గురించి తెలుసుకున్న పలువురు నెటిజన్లు ఆమెకు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తూ, బాధను దిగమింగుకుంటోందని, ధైర్యవంతురాలని పొగిడేస్తున్నారు.
Go Back to Shorts
Anchor
Rashmi
Rumatism

More Telugu News